Comedian Seshu | ప్రముఖ కమేడియన్, లొల్లూ సభ నటుడు ఫేమ్ శేషు అలియాస్ లక్ష్మీ నారాయణ్ శేషు (60) మంగళవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కన్నుమూశారు. ఈ నెల 15న గుండెపోటు రావడంతో చికిత్స కోసం దవాఖానలో చేరారు. అప్పటి నుంచి పరిస్థితి రోజురోజుకు విషమించింది. 2002లో ధనుష్ సినిమా థుల్లువదో ఇలామయి సినిమాతో శేషు సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే విజయ్ టీవీ కామెడీ షో ‘లొల్లూ సభ’తో ఆయన వెలుగులోకి వచ్చారు.
తర్వాత శేషు పలు సినిమాల్లో నటించారు. మరో హాస్య నటుడు సంతానంతో కలిసి సినిమాల్లో నటించారు. ఏ1, డిక్కిలూనా, గులుగులు, నాయి సెకర్ రిటర్న్స్, ద్రౌపథి, వాడకుపట్టి రామస్వామి సహా పలు పేరొందిన సినిమాల్లో నటించారు. 2020లో తన కొడుకు అభిలాష్ తీసిన లఘు చిత్రం ‘ఔరోరా’లో నటించారు. శేషు మరణ వార్తతో ఆయన అభిమానులు, సినీ నటులు సోషల్ మీడియా వేదికలపై సంతాపం తెలుపుతున్నారు.