Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయిన విషయం తెలిసిందే. జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నిని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అక్కడకి చేరుకున్న అల్లు అర్జున్ మేనత్త, చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ను చూసి భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా మేనత్తని చూసి దగ్గరికి వెళ్లి హాగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | Actor Chiranjeevi’s wife Surekha Konidala meets Actor Allu Arjun at the latter’s residence in Jubilee Hills, Hyderabad.
Allu Arjun was released from Chanchalguda Central Jail today after the Telangana High Court granted him interim bail yesterday on a personal bond of… pic.twitter.com/wwPsCFnRwz
— ANI (@ANI) December 14, 2024