Actor Pruthvi | విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించాడు. ఈ చిత్రం వాలంటైన్స్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా అభిమానులు అతడిని ట్రోల్ చేయడంతో పాటు లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తామని ఎక్స్‌లో ట్రెండ్ చేశారు. దీంతె దిగొచ్చిన చిత్రబృందం క్షమాపణలు తెలిపింది.
ఇదిలావుంటే తాజాగా ఈ వివాదంపై నటుడు బ్రహ్మజీ స్పందించాడు. ఈ విషయంపై బ్రహ్మజీ మాట్లాడుతూ.. లైలా విషయంలో పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తప్పు. పృథ్వీ ఒక సినిమా వేడుకకు వచ్చి అలా మాట్లాడి ఉండకుడదు. పృథ్వీ విషయంలో అతడిని టార్గెట్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్. ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా ఈ విషయాన్ని చెప్పకుడదు. లైలా విషయంలో అనవసరంగా బలి అయ్యిందంటే విశ్వక్ మాత్రమే అంటూ బ్రహ్మజీ చెప్పుకోచ్చాడు.