Actor | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరో .. ఈ లుక్ చూసి అంతా షాక్
Actor | ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు ఆయన. వరుస సూపర్ హిట్ చిత్రాలతో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే కాదు, ఆ తర్వాత సహాయక పాత్రల్లోకి మారినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
Actor | ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు ఆయన. వరుస సూపర్ హిట్ చిత్రాలతో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే కాదు, ఆ తర్వాత సహాయక పాత్రల్లోకి మారినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన సినిమాల్లోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ నటుడు ఎవరో కాదు… 80–90వ దశకంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన భానుచందర్.
1978లో విడుదలైన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భానుచందర్, తొలి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయారు. ముఖ్యంగా యాక్షన్ కథలతో తెరకెక్కిన సినిమాల్లో భానుచందర్ నటనకు అప్పట్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. తెలుగులోనే కాదు, తమిళ్లోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
భానుచందర్ కెరీర్‌కు కీలకమైన మైలురాయిగా నిలిచిన చిత్రం 1986లో వచ్చిన ‘నిరీక్షణ’. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా అందాయి. ఆ తర్వాత కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ, కాలక్రమేణా వరుస ఫ్లాపులు ఎదురుకావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆయన తన అనుభవంతో బలమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. తాజాగా 71 ఏళ్ల వయసులో భానుచందర్ వృద్ధాప్య లుక్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా కనిపించిన ఆయనను ఇప్పుడు ఈ లుక్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయినప్పటికీ, ఆయన సినీ ప్రయాణం, చేసిన పాత్రలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు మరిచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

