విశ్వక్సేన్ హీరోగా సీనియర్ నటుడు అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించబోతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ నాయికగా నటించనుంది. జగపతిబాబు మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. రోడ్ ట్రిప్ నేపథ్యంతో సాగే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆదివారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. అర్జున్ నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది. విశ్వక్ సేన్ ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో విజయాన్ని అందుకోగా..ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. విశ్వక్సేన్, అర్జున్ కాంబినేషన్ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.