Akshay Kumar | బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మీడియా జర్నలిస్టులతో సరదాగా ఫొటో షూట్ చేయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్గా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అక్షయ్ కుమార్‌ను ఫొటో జర్నలిస్టులు అక్షయ్ సార్, ఒక్క ఫొటో అంటూ అడిగారు. దీనికి అక్షయ్ స్పందిస్తూ.. మీరు ఫొటో షూట్లు చేస్తారు కదా ఇప్పుడు మనం కూడా కలిసి చేద్దాం అని సరదాగా బదులిచ్చారు. అయితే, జర్నలిస్టులు తమతో కలిసి అక్షయ్ ఫొటో దిగబోతున్నాడని అనుకునేలోపే, మన ఫొటో షూట్ కాదు, నా ఫొటో షూట్ చేయండి అంటూ వారిని ఆటపట్టించారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ వారికి పోజులివ్వడం, మీడియా ప్రతినిధులు నవ్వుతూ ఫొటోలు తీయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ‘జాలీ ఎల్ఎల్బీ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌ను అందుకున్నారు.
#AkshayKumar told the media to go ahead and do a full photoshoot since they’d already caught him near the airport. 😂📸#FilmfareLens #Celebs pic.twitter.com/r6UIfZBupb
— Filmfare (@filmfare) November 14, 2025