Ajith Kumar – Good Bad Ugly | తమిళ స్టార్ నటుడు అజిత్‌కుమార్(Ajith Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ U/A సర్టిఫికెట్‌ను అందించినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, ప్రభు, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
It’s U/A for GBU.
ENJOY THE VERA LEVEL ENTERTAINMENT WITH YOUR FRIENDS AND FAMILY 💥💥#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/jRftZ6uRU5#AjithKumar @trishtrashers @MythriOfficial… pic.twitter.com/ENTcCYSAwZ— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2025