Actor Ajith | బెల్జియం నుంచి చెన్నైకి అజిత్.. రేపు ఓటు వేయనున్న ‘తల’!
TN Elections | తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు (ఏప్రిల్ 23) జరగనున్న ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నేడు చెన్నై చేరుకున్నారు.
TN Elections | తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు (ఏప్రిల్ 23) జరగనున్న ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నేడు చెన్నై చేరుకున్నారు. అంతర్జాతీయ కార్ రేసింగ్ ఈవెంట్ కోసం గత కొన్ని రోజులుగా బెల్జియంలో ఉన్న ఆయన, ఓటు వేయడానికి ప్రత్యేకంగా విమానంలో చెన్నైకి వచ్చారు. ఇటీవల బెల్జియంలోని ప్రసిద్ధ సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ వేదికగా జరిగిన ’24H సిరీస్’ అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీలో అజిత్ తన టీమ్‌తో కలిసి అద్భుత ప్రదర్శన చేశారు. ఈ పోటీలో ఆయన బృందం రెండో స్థానాన్ని (P2) కైవసం చేసుకుని పోడియంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
ఇక రేసింగ్ ట్రాక్‌పై సత్తా చాటిన అజిత్, ఈరోజు చెన్నై విమానాశ్రయంలో సందడి చేశాడు. ఆయనను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున తల తల అంటూ నినాదాలు చేస్తూ విమానాశ్రయం వద్ద సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. రేపు ఉదయం చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాడు.
𝐖𝐄𝐋𝐂𝐎𝐌𝐄 𝐁𝐀𝐂𝐊 𝐌𝐘 𝐂𝐇𝐈𝐄𝐅🙇♂️#AjithKumar #AK #AK64 @Akracingoffl @SureshChandraa pic.twitter.com/QsgaFjPNcO
— ♠️ AjithAzar ♠️ (@AjithAzar25) April 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

