Actor Ajay – Pushpa Effect | ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు మీమ్స్ రూపంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ నటుడు అజయ్. విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా విలన్ పాత్రలో అలరించిన ఈ నటుడు ఆ తర్వాత పోకిరి, ఇష్క్ తదితర చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్గా దేవరతో పాటు మత్తు వదలరా సినిమాలో మరోసారి తన పాత్రలతో అలరించాడు. ఇక మత్తు వదలరాలోని రియా ఎక్కడ.. డోమిని ఎవరు అనే సీన్ అయితే గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలావుంటే అతడు నటిస్తున్న తాజా చిత్రం పోట్టెల్ (Pottel). అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1980 తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అజయ్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజయ్ హిందీలో నటిస్తున్న తాజా చిత్రం సింగం అగైన్. అజయ్ దేవగణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా తనను పుష్ప 2 సినిమా షూటింగ్ ఎలా అవుతుందని అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి అడిగినట్లు అజయ్ చెప్పుకోచ్చాడు. ఇది నాకు చాలా గూస్ బంప్స్ ఇచ్చిన సందర్భం. పుష్ప సినిమా వలన తెలుగు సినిమా గురించి ఫస్ట్ టైంలో హిందీలో మాట్లాడుకోవడం విన్నాను. పుష్ప 2 వలన సింగం విడుదల తేదీని వాయిదా కూడా వేద్దామనుకున్నారు. ఈ డిస్కషన్ కూడా నా ముందే జరిగిందంటూ అజయ్ చెప్పుకోచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ ముందు కూడా చెప్పాను అంటూ అజయ్ చెప్పుకోచ్చాడు.
Singham shooting ki vellinappudu Ajay Devgn,Rohith Shetty valu matladuthunnaru #Pushpa2 movie gurunchi and naku chala high ichina moment adhi ~ Actor Ajay @alluarjun #AlluArjun #Pushpa2TheRule pic.twitter.com/0hwPgLLll3
— poorna_choudary (@poornachoudary1) October 19, 2024