Aditi Rao Hydari at Cannes | ఫ్రాన్స్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత 77వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రపంచ నటీనటులు తమ స్టైల్‌తో ఆకట్టుకుంటుండగా, భారతీయ నటీమణులు తమ సంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్‌తో పాటు పలువురు నటిమణులు ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. తాజాగా బాలీవుడ్ నటి అదితి రావు హైదరి తన ట్రెడిషనల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదితి రావు హైదరి ఎరుపు రంగు డిజైనర్ చీరలో కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ చీరకు తగ్గట్టుగా ఆమె నుదుట సింధూరం ధరించి, సంప్రదాయ భారతీయ వధువులా మెరిసిపోయారు. గోల్డెన్ బ్లౌజ్, నామమాత్రపు ఆభరణాలతో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. అదితి ఎంపిక చేసుకున్న ఈ చీర ఆమెకు చక్కగా సెట్ అయ్యింది.
ఇక అదితి లుక్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ఎరుపు రంగు చీర, నుదుట సింధూరంతో అదితి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని ప్రశంసిస్తున్నారు. ఆమె ఈ లుక్‌లో భారతీయ సంస్కృతిని కేన్స్ వేదికపై గొప్పగా చాటి చెప్పారని అభిమానులు కొనియాడుతున్నారు. కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదితి ప్రదర్శించిన ఈ సంప్రదాయ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.