Kanya Kumari Movie | తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయిన నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది నటి మధు శాలిని. ఇప్పుడు ఆమె సమర్పకురాలిగా రాబోతున్న చిత్రం ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తుండగా.. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అ చిత్రం వినాయక చవితి కానుకగా.. ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో భాగాంగా నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్లో నటి మధు శాలినిని సినిమాలు ఎందుకు చేయట్లేదు అని మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చింది.
మధు శాలిని మాట్లాడుతూ.. నన్ను అందరు అడుగుతున్నారు టాలీవుడ్లో ఎందుకు గ్యాప్ వచ్చింది అని. దీనికి కారణం నా చంచల స్వభావం (Fickle nature). అస్థిరంగా ఉండడం వలన.. కెరీర్ మొదట్లో ఏ సినిమా పడితే అది ఓకే చేసి చేతులు కాల్చుకున్నా. దీంతో నాకు అర్థం అయ్యింది ఏమిటంటే ఏది పడితే అది చేయకుడదు. మనకు నచ్చితేనే చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత చాలా సినిమాలు వదిలేశాను. చివరిగా నేను తెలుగులో థియేట్రికల్‌గా నటించింది గుఢచారి సినిమానే. తర్వాత పలు వెబ్ సిరీస్‌లలో కనిపించాను. ప్రస్తుతం ఇతర భాషలలో చేయడం వలన తెలుగులో సినిమాలు చేయట్లేదు అంతే తప్ప వేరే కారణం లేదు. తెలుగు వారికి దగ్గరిగా ఉండాలనే కన్యాకుమారి సినిమాను విడుదల చేయబోతున్నాను అంటూ మధు శాలిని చెప్పుకోచ్చింది.