Balakrishna | నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎన్బీకే 109 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90శాతం పూర్తయినట్టు మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. సినిమాకు ‘వీరమాస్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలావుంటే.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ని మేకర్స్ తెరకెక్కించారట.
సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ ఫైట్‌ని రూపొందించారట. బాలయ్య గుర్రంపై వచ్చి విలన్ గ్యాంగ్‌పై విరుచుకుపడే ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని విశ్వసనీయసమాచారం. ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చున్‌ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్.