సుధీర్‌బాబు కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకంపై నారాయణ్‌దాస్ కె నారంగ్, పూస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. సోమవారం సినిమా తాలూకు వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో సుధీర్‌బాబు ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తారు. వినూత్నమైన అంశాలు కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. ఇందులో పేరున్న నటీనటులు భాగమవుతారు’ అని చిత్రబృందం పేర్కొంది.