Acteress Maheswari | టాలీవుడ్ సీనియర్ నటి మహేశ్వరి ప్రముఖ నటుడు అజిత్ కుమార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యులో భాగంగా మహేశ్వరి మాట్లాడుతూ.. అజిత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన అంటే తనకు ఒకరకమైన క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. మేమిద్దరం కలిసి రెండు సినిమాలలో నటించాం. ఇందులో ఒక సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో దాదాపు ఏడాదికి పైగా కలిసి నటించాం. అయితే ఆ టైంలో తనపై ఇంకా ఇష్టం పెరిగింది. అయితే సినిమా చివరిరోజు షూటింగ్ రోజున మళ్లీ అతడిని కలవలేను అంటూ బాధలో ఉండగా.. అజిత్ నా దగ్గరికి వచ్చి మహి నువ్వు నా చెల్లి లాంటివి అంటూ షాక్ ఇచ్చాడు. నీకు లైఫ్లో ఏం అవసరం ఉన్నా నీ ఈ అన్నయ్య ఉన్నాడు అన్నాడు. దీంతో నేను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాను అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
What a sad crush story 😂😂 pic.twitter.com/WXPXn3XQtg
— Ranisrinivas (@Ranisrinivas4) September 16, 2025