Acress Roja Daughter | ప్రముఖ టాలీవుడ్ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించిన రోజా అనంతరం రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా పని చేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడంతో ప్రస్తుతం ప్రజలతో మమేకం అవుతూ.. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇదిలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అన్షు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అన్షుమాలిక ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది.
నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ (Global Entrepreneurship) అవార్డు అందుకుంది అన్షుమాలిక. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమెనే షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.