కరోనా వలన సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ పడడమే కాక, థియేటర్స్ కూడా మూతపడ్డాయి. ఈ పరిస్థితులలో చాలా సినిమాలు అటకెక్కాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో మళ్లీ వేగం పుంజుకున్నాయి. థియేటర్స్‌లో సినిమాలు విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. కాని ఆచార్య చిత్ర విడుదలపై ఇంకా సందేహాలు నెలకొని ఉన్నాయి.అయితే వచ్చే డిసెంబర్ నెల 17కే ఈ డేట్ ఫిక్స్ అయ్యింది అని టాక్ ఉన్నా.. ఇంకా అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఆచార్య సినిమాను ముందుగా డిసెంబర్ 24న విడుదల చేయాలని భావించారు. కానీ జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయనుండగా, డిసెంబర్17న రిలీజ్ అనుకున్నారు. కాని పుష్ప అదే డేట్‌కి విడుదల కానున్న నేపథ్యంలో ఆచార్య మూవీపై నీలి నీడలు కమ్ముకున్నాయి.