Acharya movie | ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఉత్తరాదిలో మన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. టాలీవుడ్ నుండి కొత్త సినిమా వస్తుందంటే బాలీవుడ్ తమ సినిమాల విడుదల విషయంలో ఆయోమయంలో పడుతున్నాయి. బాహుబలి, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటినిచ్చాయి. యూట్యూబ్‌లోనూ మన సినిమాలు హిందీ వెర్షన్లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పటికే భీమ్లానాయక్ హిందీలో విడుదలకానుండగా తాజాగా ఆచార్య చిత్రాన్ని కూడా హిందీలో విడుదలచేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
కొరటాలశివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రంలో చిరంజీవి,రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఏప్రిల్ 29న విడుదలకానున్న ఈ చిత్రాన్ని హిందీ భాషలోనూ విడుదల చేయనున్నారట. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయనుందట. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి.