Acharya Ticket Prices | ‘ఆచార్య’ టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం
Acharya Ticket Prices | టాలీవుడ్ మెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపైన అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటూ ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునే అనుమతిని ఇచ్చింది. ఏప్రిల్ 29నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే వెసలు బాటును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా ప్రకటించింది. అయితే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ వంటి వ్యత్యాసం లేకుండా ఏపీ ప్రభుత్వం పదిరోజుల పాటు ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఆచార్య షూటింగ్‌ను మారెడు మిల్లి అడవిల్లో కొంత వరకు షూటింగ్ జరిపారు. కాగా ఏపిలో చిత్రీకరణ చేయడం, నిర్మాణ వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది.
ఇక తాజాగా సోమవారం రోజు నైజాంలో కూడా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వారం రోజులు అంటే ఏప్రిల్29 నుంచి మే5 వరకు ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్‌లో రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 వరకు పెంచుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా వారం రోజుల పాటు ఐదో ఆటకు కూడా పర్మిషన్ ఇచ్చింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మ్యట్నీ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

