‘జూనియర్’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు కిరీటి రెడ్డి. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం అగ్ర దర్శకుడు రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో అభిని తల్లిదండ్రులు గారాబంగా పెంచుతారు. కాలేజీలో అతను స్ఫూర్తిని ప్రేమిస్తాడు. అప్పటి వరకు హాయిగా సాగిన అభి జీవితం ఒక్కసారిగా మలుపులు తీసుకుంటుంది. తన తండ్రి ఊరిలో ఓ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అభిపై పడుతుంది.
ఈ క్రమంలో ఏం జరిగిందనే సంఘటనలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అభి పాత్రలో కిరీటి రెడ్డి పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఎమోషన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: రజనీ కొర్రపాటి, రచన-దర్శకత్వం: రాధాకృష్ణ.