బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాబ్ విశ్వాస్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఏదో సీన్ చేస్తున్నప్పుడు కిందపడగా, ఆయన భుజానికి బలమైన గాయమైందట. వెంటనే లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అభిషేక్ బచ్చన్ హాస్పిటల్లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్‌తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. గాయపడిన అభిషేక్ బచ్చన్ చికిత్స నిమిత్తంలీలావతి ఆసుపత్రిలో చేరగా, తనయుడిని చూడడనికి అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా బచ్చన్ తో కలిసి ఆదివారం లీలావతి ఆసుపత్రిని సందర్శించినట్లు బీ టౌన్ టాక్.
అభిషేక్ గాయంపై లీలావతి ఆసుపత్రి సీఈఓ స్పందిస్తూ.. ఆయన షూటింగ్లో గాయపడ్డారని, గాయం చిన్నదే అని చెప్పారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లారని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారని వార్తలతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.