Abhinaya| తమిళనాడుకు చెందిన అభినయ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. అభినయ మొదటి తెలుగు సినిమా 2009లో వచ్చిన “నాడోడిగల్” మలయాళ సినిమాకు రీమేక్ అయిన “శంభో శివ శంభో”. రవితేజ హీరోగా వచ్చిన శంభో శివ శంభో సినిమాలో అవకాశం దక్కించుకొని చాలా ఫేమస్ అయింది. అలానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ల సోదరిగా కూడా నటించి ప్రశంసలు అందుకుంది. ఆమె నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించారు. కింగ్, దమ్ము, ధ్రువ, సీతా రామం, గామీ తదితర తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అభినయ .. మార్క్ ఆంటోనీ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ ని మెప్పించింది.
అయితే కొద్ది రోజుల క్రితం అభినయ నిశ్చితార్థం చేసుకుంది. ఉంగరాలు మార్చుకొని, గుడిగంటలు కొడుతున్న ఫొటోని పంచుకుంది. దీంతో అభినయ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి ఆరాలు తీసారు. కొందరైతే విశాల్‌తో ఈ అమ్మడి వివాహం జరగబోతుందంటూ ప్రచారాలు చేశారు. కాని అభినయ కు కాబోయే భర్త పేరు కార్తీక్. కొద్ది రోజుల క్రితం ఇతని పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసి అందరిలో ఉన్న అనేక అనుమానాలని పటాపంచలు చేసింది.కార్తీక్.. హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాగా, ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోనే అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయముందని, ఇద్దరూ ప్రేమలో కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. మరి పెళ్లి తేది ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ఏది ఏమైన అభినయ పెళ్లి పీటలు ఎక్కుతున్ననేపథ్యంలో ఆమెకి ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.