స్వీయ దర్శకనిర్మాణంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్’. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, మాదకద్రవ్యాల మాఫియాను అణచివేయాలనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లలో శిక్షణ పొంది దేశ రక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నదే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యమని దర్శకనిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ తెలిపారు. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.