ప్రేమదేశం హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా..?

కొన్ని డబ్బింగ్ సినిమాలు ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అది నిత్యనూతనంగా ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన సినిమా ప్రేమ దేశం. 1996లో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అబ్బాస్. ఎక్కడో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన ఈయన తెలుగు, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన అబ్బాస్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే పదేళ్లకు పైగానే అయ్యుంటుంది ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేసి. కేవలం 20 ఏళ్ళ వయసులో హీరోగా అడుగుపెట్టిన ఈయన.. 40 ఏళ్ల లోపు రిటైర్మెంట్ తీసుకున్నాడు.
అబ్బాస్ కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది చాలా మందికి కనీసం తెలియదు. సినిమాలు చేయడం లేదు.. మోడలింగ్ కూడా మానేశాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది అభిమానులకు సస్పెన్స్. దీనికి సమాధానంగా ఆయన సోషల్ మీడియా పేజీ నిలిచింది. ఈయన ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్నాడు. కొన్నేళ్ళుగా అక్కడే నివసిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అబ్బాస్ పూర్తిగా ఇప్పుడు న్యూజిలాండ్ వాసి అయిపోయాడు. కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయాడు ప్రేమదేశం హీరో. ప్రస్తుతం ఈయన మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్నాడు. ఇలాంటి ఒక జాబ్ ఉంటుందా అని చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం అదే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మోటివేషనల్ స్పీచ్ చాలా మందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్.
ఒకప్పుడు తన హెయిర్ స్టైల్ అందంతో అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకర్షించాడు అబ్బాస్. చాలా తక్కువ సమయంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేశాడు.. హిందీలో కూడా నటించాడు. అయితే 2010 తర్వాత ఈయన పూర్తిగా తన దారి మార్చుకున్నాడు. అడపాదడపా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ ఏర్పాటు చేసుకున్నాడు అబ్బాస్. ప్రస్తుతం అందులోనే ఆనందంగా ఉన్నాడు. న్యూజిలాండ్ లో భారతీయులను కలిసినప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అంటూ కుండ బద్దలు కొట్టేసాడు అబ్బాస్.
ఇవి కూడా చదవండి..
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abbas
- prema desam
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

