గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. బి.గోపాల్ దర్శకుడు. తాండ్ర రమేష్ నిర్మాత. ఈ నెల 8న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నా పేరు శివ… పుట్టింది బెజవాడ, పెరిగింది హైదరాబాద్. పరిచయమైతే మర్చిపోను..’ అంటూ తన పాత్రను పరిచయం చేసుకుంటూ గోపీచంద్ చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా సాగాయి. ప్రత్యర్థుల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేసే వ్యక్తిగా ఆయన పాత్ర చిత్రణ శక్తివంతంగా అనిపించింది. ‘కుటుంబమే నా ఆస్తి… నా కుటుంబం జోలికి ఎవడొచ్చినా రిక్టర్ స్కేల్ పగిలిపోద్ది’ అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. ప్రకాష్‌రాజ్, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థ: జయ బాలాజీ రియల్ మీడియా.