న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో దిపావళీ సెలబ్రేట్ చేసుకున్నది. దీపావళి వేళ సాంప్రదాయ సిల్క్ చీర కట్టిన ఇరా ఖాన్.. తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖర్ ఇంట్లో పండుగను ఎంజాయ్ చేసింది. నుపుర్ తల్లి ప్రీతమ్ శిఖరే కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నది. ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్.. ఇరాతో దిగిన ఫోటోలను ఆన్లైన్లో పోస్టు చేశాడు. ముగ్గురూ సాంప్రదాయదుస్తులతో ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే నుపుర్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఇరా ఖాన్ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కూతురే ఇరా ఖాన్. గతంలో ఇరాఖాన్ డిప్రెషన్‌తో బాధపడింది. కొన్ని మానసిక సమస్యలతో సతమతం అయినట్లు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లోనూ చెప్పుకున్నది.