Rajinikanth | లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కూలీ’ ట్రైలర్ లాంచ్ వేడుక చెన్నైలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అమీర్ ఖాన్.. రజినీకాంత్‌ను ఉత్సాహంగా పలకరించడమే కాకుండా, ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం హత్తుకున్నారు. ఇది అభిమానుల మపనసులని తాకింది.
ఈ వేడుకలో అమీర్ ఖాన్ తన తాజా పాత్ర అయిన ‘దాహా’ గెటప్‌లో కనిపించగా, రజినీకాంత్ సింపుల్‌గానే ఉన్నారు. బాలీవుడ్లో అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి ఇంత ఒదిగి ఉండడం అమీర్ ఖాన్‌కే చెల్లింది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కూలి చిత్రంలో అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు. ఓ సందర్భంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. లోకేష్ నన్ను కలిసిన సమయంలో, ఇది రజిని సర్ సినిమా అని చెప్పగానే వెంటనే నేను ఏమీ అడగలేదు, ఏ స్క్రిప్ట్ వినలేదు , నేను చేస్తాను అని వెంటనే చెప్పేశా. ఎందుకంటే, ఆయన పెద్ద అభిమానిని నేను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అని తెలిపారు.
అలాగే, లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయాన్ని కూడా అమీర్ ఖాన్ ధృవీకరించారు. త్వరలోనే మేము ఇద్దరం కలిసి ఒక పూర్తి లెంగ్త్ సినిమా చేయబోతున్నాం అని పేర్కొన్నారు. కూలీ విషయానికి వస్తే ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, మోనిషా బ్లెస్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి పోటీగా వార్ 2 కూడా విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి తమ చిత్రాన్ని జనాలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Rajini1