అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ చేయబోయే తదుపరి చిత్రమేమిటన్నది బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. స్పానిష్ సినిమా ‘ఛాంపియన్స్’ హిందీ రీమేక్‌ను తెరకెక్కించడానికి ఆయన గత కొంతకాలంగా సన్నాహాలు చేస్తున్నారు. 2008లో విడుదలై ఈ చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలందుకొంది. వివిధ రకాల మానసిక వైకల్యాలతో బాధపడే యువకులతో కూడిన బాస్కెట్‌బాల్ బృందం పన్నెండుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలవడమే ఈ సినిమా ఇతివృత్తం. యువతలో స్ఫూర్తినింపే కథ కాబట్టి ఆమిర్‌ఖాన్ హిందీ రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నారని చెబు తున్నారు. ఈ రీమేక్‌కు ఆర్. ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మరింత కసరత్తులు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఆమిర్‌ఖాన్ ఉన్నారని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.