లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్.. గత కొన్ని రోజులుగా విపరీతంగా వైరల్ అవుతున్న వార్త ఇది. అందులో నిజం లేకపోలేదు. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది అంతే. అయితే.. ఈ లోపు లోకేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో ఆమిర్‌ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఆ సినిమా ఏదో కాదు. రజనీకాంత్ ‘కూలీ’. ముందు కొసరుగా ‘కూలీ’లో నటిస్తారు ఆమిర్‌ఖాన్.
తర్వాత అసలు సినిమా మొదలవుతుందన్నమాట. ఇదిలావుంటే.. కమల్‌హాసన్ ‘విక్రమ్’లో రోలెక్స్ అంటూ సినిమా చివర్లో సూర్య పాత్రను పరిచయం చేసి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు లోకేశ్ కనకరాజ్. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ని ‘కూలీ’లో ఆమిర్‌ఖాన్‌తో రిపీట్ చేస్తారా? అన్నది తెలియాల్సివుంది. పూణేలో మంగళవారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మరి ఆమిర్ ఆగమనం ఎప్పుడో తెలియాల్సివుంది.