Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో(Vijay) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ దళపతి 68 (Thalapathy 68)పైనే ఫోకస్ పెట్టాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా కోసం లుక్ టెస్ట్‌లో భాగంగా దళపతి విజయ్ టీం లాస్ ఏంజెల్స్‌కు వెళ్లిందని తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ మెయిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో ఫైనల్ అయింది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక రావడమే ఆలస్యమని సమాచారం. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ (Aamir khan) కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త కూడా క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరూ క్రేజీ కాంబో విజువల్ అందించడం పక్కా అయినట్టేనంటున్నారు సినీ జనాలు.
పాన్ ఇండియా స్టోరీతో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న దళపతి 68 చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. దళపతి 68లో అలనాటి అందాల హీరోయిన్ జ్యోతిక (Jyothika) మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా కనిపించబోతున్నట్టు టాక్. దళపతి 68 మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
లాస్ ఏంజెల్స్‌లో విజయ్..
Welcome to the future!!! #Thalapathy68 @actorvijay @archanakalpathi pic.twitter.com/snWrqMEjfU
— venkat prabhu (@vp_offl) August 31, 2023
ఎయిర్‌పోర్టులో విజయ్..
Thalapathy Tharisanam 💙#ThalapathyVijay & the #Thalapathy68 team, accompanied by @vp_offl & @archanakalpathi, arrived at Los Angeles International Airport ✈️ (LAX) at 12:30 AM today. They traveled from Chennai to Los Angeles via Singapore & Tokyo on Singapore Airlines Flight. pic.twitter.com/HgzLX5FHGW
— KARTHIK DP (@dp_karthik) August 30, 2023
లియో టైటిల్ ప్రోమో..
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..