Aamir Khan | కొంతకాలంగా వస్తున్న పుకార్లను నిజం చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్, స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో ఉన్న అమీర్‌ఖాన్ నివాసంలో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంటున్న తమ ఫేవరేట్ యాక్టర్‌కు అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే అమీర్ ఖాన్ వెడ్డింగ్‌కు సంబంధించి పలు డిస్కషన్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. 61 ఏండ్ల వయస్సులో అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు యూజర్లు ప్రశ్నిస్తుంటే.. మరికొంతమందేమో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ 31 ఏండ్ల వయస్సు ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు ఏంటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట సరికొత్త చర్చకు దారి తీశాయి.
అమీర్ ఖాన్ వ్యక్తిగత నిర్ణయాన్ని సమర్థించేవారు ఓ వైపు.. వ్యతిరేకించే వారు మరోవైపు చేరి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చర్చ సంగతి అలా ఉంటే మరి జునైద్ ఖాన్ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతాడన్నది చూడాలి.