Aamir Khan | ఈ మధ్య సినీ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం వెరైటీ స్టంట్స్ చేస్తున్నారు. కొందరు గొడవలు పడుతున్నట్టు, ఇంకొందరు విచిత్ర పనులు చేస్తూ తాము నటిస్తున్న సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా నటుడు ముంబై రోడ్లపై నిలబడి వడ పావ్ అమ్ముతూ కనిపించాడు. ఇది చూసి అందరు షాక్ అయ్యారు. అంత పెద్ద హీరో రోడ్లపై నిలుచొని వడపావ్ అమ్మడం ఏంటని వింతగా చూశారు. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌట్. మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ తన సినిమా ప్రమోషన్ల కోసమే ఇలా వింతగా ప్రవర్తించాడని తెలిసి ఫ్యాన్స్ నోరెళ్ల బెట్టారు.
గత కొద్ది రోజులుగా ఆమిర్ ఖాన్ సరైన సక్సెస్ సాధించక ఇబ్బందులు పడుతున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై వీధుల్లో వడ పావ్ అమ్మాడు ఈ స్టార్ హీరో.’సితారే జమీన్ పర్’లో ఆమిర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్ తదితరులు నటించారు. ఆమిర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో కాస్త ఎక్కువ బాధ్యతలు తీసుకున్న. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.
‘సితారే జమీన్ పర్’ సినిమా ‘ఛాంపియన్స్’ సినిమాకి రీమేక్ అని తెలుస్తుంది.. ఈ సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారు. రణబీర్ కపూర్, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నెక్స్ట్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఇది ఒక సూపర్ హీరో కథాంశంతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ 2026లో ప్రారంభం కానుంది. అమీర్ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.