Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక గతేడాది నవంబర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ నుపూర్ శిఖరేతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అయితే గతేడాది నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దాంతో వీళ్ల పెళ్లిపై రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. బ్రేకప్ చెప్పుకున్నారని, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఇలా పలు రూమర్స్ నెట్టింట షికారు చేశాయి. కాగా వాటన్నిటికి అమీర్‌ఖాన్ ఫుల్ స్టాప్ పెట్టాడు.
వచ్చే ఏడాది జనవరి 3న తన కూతురు ఐరాఖాన్ పెళ్లి ఉంటుందని, ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పుకొచ్చాడు. దాంతో ఇన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఐరా ఖాన్ గత మూడేళ్లుగా తన ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో డేటింగ్ చేస్తుంది. గతంలో ఐరా, నుపూర్‌లు కలిసి పలు పార్టీలకు అటెండ్ అయ్యారు. ఇద్దరు కలిసి పబ్బులకు వెళ్తూ మీడియా కంటపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయింది.
ఓ సైక్లింగ్ ఈవెంట్లో నుపూర్ సడెన్‌గా వచ్చి ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఆమె అంగీకరించింది. ఆమె వేలికి రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం ఐరా.. నుపూర్‌కు లిప్ కిస్ ఇచ్చి.. తన ప్రేమను తెలిపింది. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. మొత్తంగా ఐరా, నుపూర్ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
#AamirKhan has reportedly revealed that daughter #IraKhan will get married to #NupurShikhare on January 3rd! pic.twitter.com/WsRtAB2loq
— Filmfare (@filmfare) October 11, 2023