Aamir Khan | అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ నటించిన ‘అందాజ్ అప్నా అప్నా’ (1994) చిత్రం కామెడీ జోనర్లో కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో అమర్, ప్రేమ్ పాత్రల్లో అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ పండించిన హాస్యం అందరినీ అలరించింది. రాజ్‌కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కోసం రంగం సిద్ధమవుతున్నదని అమీర్‌ఖాన్ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి సీక్వెల్‌కు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. కొద్దిరోజుల్లోనే ఈ సీక్వెల్‌పై మరింత స్పష్టత వస్తుంది’ అని అమీర్‌ఖాన్ పేర్కొన్నారు.