దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో అమీర్‌ఖాన్. తాజాగా ఆయన కొత్త సినిమా తాలూకు అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్ట్టమస్ పర్వదినం సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు అమీర్‌ఖాన్ తెలిపారు. స్వీయ నిర్మాణ సంస్థ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
అయితే ఈ సినిమాకు దర్శకుడెవరు? కథాంశమేమిటనే విషయాలను ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘లాల్‌సింగ్ చద్దా’ పరాజయం దృష్ట్యా తన తాజా సినిమా విషయంలో అమీర్‌ఖాన్ గోప్యత పాటిస్తున్నానడని, ఎలాంటి ఆర్భాటం లేకుండా సినిమా విడుదల చేసి హిట్ కొట్టాలనే తపనతో ఉన్నారని చెబుతున్నారు.