Coolie Movie | తలైవర్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దాహా అనే డాన్ పాత్రలో మెరిశాడు ఆమిర్ ఖాన్. అయితే ఈ పాత్రపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమిర్ పాత్రను ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేదని ఆమిర్ ఎందుకు ఈ పాత్రను ఒప్పుకున్నాడని కామెంట్లు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై ఆమిర్ స్పందిస్తున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది.
ఇందులో ఆమిర్ మాట్లాడుతూ.. తాను కూలీ సినిమాకు ఒప్పుకుని చాలా తప్పు చేశానని.. ఇది నా కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి అంటూ ఆమిర్ చెప్పినట్లు పలు వార్తలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీనిచ్చాడు తమిళ నటుడు విష్ణు విశాల్. విష్ణు విశాల్‌కి, ఆమిర్ ఖాన్‌కి మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఆమిర్ అమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు చెన్నైకి తీసుకురాగా.. వారందరూ విష్ణు విశాల్ ఇంట్లోనే బస చేశారు. దీంతో అప్పుడే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.
అయితే తాజాగా ఆమిర్ వ్యాఖ్యలపై విష్ణు స్పందిస్తూ.. కూలీ సినిమాపై ఆమిర్ ఎటువంటి నెగిటివ్ కామెంట్లు చేయలేదు. కావాలని ఎవరో ఇలాంటి ప్రచారం చేశారు. దీనిపై ఆమిర్ కూడా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. కేవలం రజనీకాంత్ మీద ప్రేమతోనే ఈ సినిమాను ఆమిర్ చేసినట్లు విష్ణు తెలిపాడు.
“#AamirKhan sir didn’t give any negative negative interview against #Coolie, he clarified that in press release too. AamirKhan sir told me that he done Coolie, because of pure love towards #Rajinikanth sir & he was happy about that scene🫶”
– #VishnuVishal pic.twitter.com/lyyL3JvzSI— AmuthaBharathi (@CinemaWithAB) October 22, 2025