సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రం నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ భాగమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
రజనీకాంత్‌కు తాను వీరాభిమానినని, ఆయన సినిమాలో అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోనని, ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని అమీర్‌ఖాన్ అన్నారు. ఈ సినిమాలో అమీర్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక అమీర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది.