Aamir Khan auditioned | బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావ్ (Kiran Rao) తన మాజీ భర్త ఆమిర్ ఖాన్ని సినిమా అడిషన్లో రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లాపటా లేడీస్’ (Laapataa Ladies). ఈ సినిమాకు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) దర్శకత్వం వహించింది. జమ్తారా(Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా గతేడాది మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం కిరణ్ రావు అడిషన్స్ నిర్వహించగా.. ఇందులో ఆమిర్ ఖాన్ కూడా పాల్గోన్నాడు. మూవీలో శ్యామ్ మనోహర్ అనే పోలీస్ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ అడిషన్ ఇవ్వగా.. ఆ పాత్రకు ఆమిర్ సెట్ కాకపోవడంతో అతడిని రిజెక్ట్ చేసింది కిరణ్ రావు. అనంతరం ఈ పాత్రకు భోజ్‌పూరి నటుడు రవికిషన్ను ఎంపిక చేసింది.
లాపతా లేడిస్ సినిమా కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట పెళ్లి అనంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చిన చూసిన అనంతరం తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా వచ్చింది. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రాగా దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో కిరణ్ రావ్ మెగాఫోన్ పట్టింది.
Aamir Khan auditioned for Ravi Kishan’s role in Laapata Ladies but was rejected pic.twitter.com/BqHLOaRXqC
— Pinku (@pinkutalks) March 26, 2025