భారతీయ సినీ పితామహుడుగా అభివర్ణించే దాదాసాహెబ్ఫాల్కే జీవిత కథను వెండితెర దృశ్యమానం చేయడానికి అగ్ర హీరో అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హీరానీ గతకొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రిప్ట్‌వర్క్ మొత్తం పూర్తయిందని, అక్టోబర్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను అమీర్‌ఖాన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. అమీర్‌ఖాన్-రాజ్‌కుమార్ హీరానీ కలయికలో గతంలో త్రీ ఇడియట్స్, పీకే వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చాయి.
దాంతో తాజా ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అమీర్‌ఖాన్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ‘ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించే ఎలిమెంట్స్ ఈ స్క్రిప్ట్‌లో లేవు. మొత్తం సీరియస్ డ్రామాలా డిజైన్ చేశారు. వినోదం మచ్చుకైనా లేదు. స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తే ఈ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు’ అని అమీర్‌ఖాన్ రాజ్‌కుమార్ హీరానీకి తేల్చిచెప్పారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా కార్యరూపం దాల్చేది అనుమానమేనని బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.