Aagadu Movie | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆగడు(Aagadu). దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా రావడంతో మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ జనాలు ఎగబడి ఈ సినిమాకు వెళ్లారు. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా పరజయంపై తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల స్పందించాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడం గురించి స్పందించాడు.
నా సినిమా కెరీర్లో అతిపెద్ద రిగ్రెట్ ఆగడు చిత్రం. ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి డెసిషన్ నేనే తీసుకున్నాను. అలా డెసిషన్స్ తీసుకోవడానికి కారణాలు చాలా స్టుపిడ్‌గా ఉంటాయి అది తప్పు. అసలు ఆగడు సినిమాకు అనుకున్న కథ అది కాదు. వేరే కథ అనుకున్నాం. దూకుడు తర్వాత ఇంకా పెద్దగా చేయాలని ఆ కథ చెప్పాను. మహేశ్ కుడా చాలా ఆసక్తిగా ఉండేవాడు. అయితే నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథను చేంజ్ చేశాం. ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆగడు చేశాం. అయితే ఈ సినిమాకు కూడా చాలా కష్టపడ్డాను. కానీ దూకుడు తర్వాత ఉన్న అంచనాల వలన ఈ సినిమా ఆ స్థాయిని అందుకోలేక పోయింది. అందుకే ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా నా గోయ్యి నేనే తవ్వుకున్నాను అనిపిస్తుంది అంటూ శ్రీను వైట్ల చెప్పుకోచ్చాడు.