Aadipurush | మంత్రం కన్నా గొప్పది నీ నామం.. ట్రెండింగ్‌లో ఆదిపురుష్ కొత్త లుక్
ఓం రౌత్ (Om Raut) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Aadipurush). ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్.. అంటూ విడుదల చేసిన తాజా లుక్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Aadipurush). మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సీతారాముల పక్కనే లక్ష్మణుడు, వారి ఆశీస్సులు తీసుకుంటున్న హనుమంతుడి లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్.. అంటూ విడుదల చేసిన తాజా లుక్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఓం రౌత్ రామాయణానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సిల్వర్ స్క్రీన్‌పై మరింత కలర్ఫుల్గా చూపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఈ మూవీని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తుండగా.. హనుమంతుడి పాత్రలో దేవ్‌దత్తా నగే నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాచెట్-పరంపర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. మిక్స్ డ్ రెస్పాన్ వచ్చింది.
ఆదిపురుష్ కొత్త లుక్..
Mantron se badhke tera naam
Jai Shri Ramमंत्रों से बढ़के तेरा नाम
जय श्री रामమంత్రం కన్నా గొప్పది నీ నామం
జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage pic.twitter.com/yjUXLb06RJ— T-Series (@TSeries) March 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

