హైదరాబాద్ : నటుడు ఆది సాయికుమార్ ఈ ఏడాది మరో కొత్త మూవీకి సంతకం చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రం చుట్టాలబ్బాయికి దర్శకత్వం వహించిన వీరభద్రంతో ఆది మరోమారు చేతులు కలుపుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆహా నా పెళ్లంట, పూలరంగడు వంటి సినిమాలతో దర్శకుడుగా వీరభద్రం ఖ్యాతిని సంపాదించారు. విజన్ సినిమాస్, శివరాత్రి ఫిల్మ్స్ పతాకాలపై నాగరం తిరుపతి రెడ్డి, పి.మన్మధరావు తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాను దర్శకత్వం వహించి, ఆది నటించిన చుట్టాలబ్బాయి తన కెరీర్లోనే విజయవంతమైన చిత్రమని దర్శకుడు వీరభద్రం అన్నారు. మా కలయికలో మరో పెద్ద హిట్ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. సినిమా నాణ్యత, నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా కలిసి పనిచేసి పెద్ద కమర్షియల్ ఎంటర్టైన్ హిట్ అందివ్వనున్నట్లు దర్శకుడు చెప్పారు.