ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)లో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించారు.
అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల వంటి టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో తమ చిత్ర టీజర్‌ను ప్రదర్శించడం ఆనందంగా ఉందని, అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, ‘శంబాల’ అనే ఓ మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుందదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.