Shambala | సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే యంగ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ నటుడు ఆదిసాయికుమార్ (Aadi Saikumar). చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆదిసాయికుమార్ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న శంబాల (SHAMBHALA)లో నటిస్తున్నాడని తెలిసిందే. ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నాడు.
తాజాగా మేకర్స్ స్టన్నింగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. శంబాల మిస్టికల్ వరల్డ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ కట్ చేసిన మేకింగ్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సారి హిట్ కొట్టడం పక్కా అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. మరి సిల్వర్ స్క్రీన్‌పై శంబాల ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
చాలా రోజుల క్రితం మేకర్స్ లాంచ్ చేసిన పోస్టర్లో ఆది సాయికుమార్ మంటల మధ్యలో నుంచి సైకిల్‌పై వస్తూ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. మరోవైపు పొలంలో వింత ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మ.. మరోవైపు ఆకాశం నుంచి భూమివైపు వస్తున్న నిప్పు కణం చూడొచ్చు. అనుమానాస్పద ప్రపంచం.. అంటూ ఇప్పటికే మరో లుక్ కూడా విడుదల చేసి హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.
You know the mystical world of #Shambala ☄️
Now step behind and witness the magic that built it ✨
🎥 Presenting the Making Video of
SHAMBHALA: A MYSTICAL THRILLERhttps://t.co/0IOnIzkEUk@iamaadisaikumar @tweets_archana #Swasika@ugandharmuni @ayeshamariam9… pic.twitter.com/jjeJiAwOW9— Ramesh Bala (@rameshlaus) April 14, 2025
Prithviraj Sukumaran | హైదరాబాద్ సెన్సేషనల్ స్టోరీతో పృథ్విరాజ్ సుకుమారన్,కరీనాకపూర్ సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
HIT 3 Trailer | 9 నెలల పాప సార్.. మిస్టరీ నేపథ్యంలో నాని హిట్ 3 ట్రైలర్