HIT 3 Trailer | 9 నెలల పాప సార్.. మిస్టరీ నేపథ్యంలో నాని హిట్ 3 ట్రైలర్
HIT 3 Trailer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న సినిమా హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
HIT 3 Trailer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న సినిమాల్లో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ హిట్ ప్రాంఛైజీ హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఉంటే భూమి మీద 10 అడుగుల సెల్లో ఉండాలి.. లేదంటే భూమిలో ఆరడుగుల లోతులో ఉండాలి.. ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. అలా ఫీలవ్వడానికి పర్సనల్‌గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్.. పోలీసోడైతే చాలు అంటూ అర్జున్ సర్కార్ చెబుతున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్.
9 నెలల పాప సార్.. ఏం చేశారు సార్ ఆ రాస్కెల్స్ అంటూ బాధిత చిన్నారి తల్లి విచారణలో చెబుతూ.. నా పాప నాకు కావాలి సార్ అంటోంది. మిస్సింగ్ అయిన బేబీ మిస్టరీని పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. గ్రిప్పింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
HIT 3 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాని హోం బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
హిట్ 3 ట్రైలర్..
Read Also :
Tamannaah Bhatia | పెళ్లెప్పుడు చేసుకుంటావని అడిగిన యాంకర్.. స్టన్నింగ్ రిప్లై ఇచ్చిన తమన్నా..!
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
Madhavi Latha | ఇప్పుడు కాకపోయిన త్వరలో కుక్క చావు చస్తావు.. మాధవీ లత శాపాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

