ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘యస్ఐ యుగంధర్’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ జూలూరు నిర్మాత. మేఘలేఖ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సందీప్‌కిషన్ క్లాప్‌నిచ్చారు.
క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిదని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను విలన్‌గా నటిస్తున్నానని రాకేందుమౌళి పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత చెప్పారు. యంగ్టీమ్తో సరికొత్త ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథ నచ్చి ఈటీవి విన్ ఓటీటీ రైట్స్ తీసుకున్నదని హీరో ఆది సాయికుమార్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రవీంద్రనాథ్ టీ, సంగీతం: ప్రణవ్ గిరిధరన్, ప్రొడక్షన్ డిజైనర్: భవిష్య శ్రీ పాకలపాటి, నిర్మాణ సంస్థ: శ్రీపినాక మోషన్ పిక్చర్స్, దర్శకత్వం: యశ్వంత్.