ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కల్యాణ్ జి.గోగన దర్శకుడు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఆది సరసన పాయల్ రాజ్‌పుత్ నాయికగా నటిస్తోంది. శనివారం నిర్మాత నాగం తిరుపతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు చిత్రం యూనిట్ సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ ‘తీస్మార్ ఖాన్’ టీమ్‌తోనే మరో సినిమా చేస్తున్నాను. త్వరలోనే ‘తీస్మార్ ఖాన్’ను గ్రాండ్‌గా విడుదల చేస్తాం. ప్రతి ఏడాది ఆదితో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’ అన్నారు. ‘తీస్మార్ ఖాన్’ చిత్రం అందరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం వుందని హీరో ఆది తెలిపారు.