ఆది సాయికుమార్ నటించిన ‘శంబాలా’ మూవీ ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ని యువ నిర్మాత రాజేష్ దండా కలిసి శుభాకాంక్షలు అందించారు. ఈ క్రమంలోనే హాస్య మూవీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా నెక్ట్స్ సినిమాను ఆయన ప్రకటించారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామని రాజేష్ దండా పేర్కొన్నారు. హాస్య మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సినిమా చేస్తున్నందుకు ఆది సాయికుమార్ ఆనందం వెలిబుచ్చారు.