Sabdham | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం శబ్దం (Sabdham) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఎక్జయిటింగ్ న్యూస్ తెలియజేశారు. శబ్దం ఫస్ట్ లుక్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్ అప్డేట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైశాలి తర్వాత ఆది పినిశెట్టి, అరివజగన్ వెంకటాచలం కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
లైలా (Laila)ను ఎప్పుడూ చూడనట్వంటి పాత్రలో చూడబోతున్నారంటూ మేకర్స్ అప్డేట్ షేర్ చేశారు. ఇంతకీ లైలా ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. లైలా గతేడాది కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లైలా సుమారు 16 ఏళ్ల తర్వాత మంచి స్కోప్ ఉన్న పాత్రలో మెరిసి.. సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోందంటున్నారు సినీ జనాలు.
#Eeram Trio @dirarivazhagan @AadhiOfficial & @MusicThaman is back 🌊 A Spine-chilling symphony that echoes through the depths of sound horror🔊
Prepare your eyes for a spooky symphony, First look on 14th December 2023! Stay stuned✨
Produced by @7GFilmsSiva @Aalpha_frames pic.twitter.com/h7ag0aPqnW
— 7G Films (@7GFilmsSiva) December 13, 2023
Lights, Camera, Smile! The ever-smiling & radiant actress @lailalaughs joins the sets of #Sabdham for a never seen before role.
Starring @AadhiOfficial
An @dirarivazhagan Film
A @MusicThaman MusicalProduced by @7GFilmsSiva & @Aalpha_frames#LakshmiMenon @KingsleyReddin pic.twitter.com/QFJ3JRsLZq
— 7G Films (@7GFilmsSiva) March 9, 2023
శబ్దం లుక్ షేర్ చేసిన ఆదిపినిశెట్టి..
Need all your best wishes as we begin this new journey today🙏🏼#SABDHAM – The sound that's never heard!
Team #Eeram reunites!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @Synccinema pic.twitter.com/rgU5UY43VR— Aadhi🎭 (@AadhiOfficial) December 14, 2022
Read Also :