అది పినిశెట్టి హీరోగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. మడోన్నా సెబాస్టియన్ కథానాయిక. జెనూస్ మొహమద్ దర్శకుడు. వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. మీడియా సంస్థకు అధిపతి అయిన ‘జే’.. తన ఫియాన్సీతో లండన్‌లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అతని సంస్థ అకౌంట్సన్నీ ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ‘జే’ ప్రతి మూమెంట్‌ని గమనిస్తూ అతడ్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు.
తన మీడియా సంస్థకు చెందిన విషయాలన్నీ ఆన్లైన్లో ఉంచుతూ సంస్థ గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన వ్యక్తిగత జీవితంతో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ని ‘జే’ ఎలా పట్టుకున్నాడు? అసలు ఆ హ్యాకర్ ఎవరు? అనే అంశాలు ట్రైలర్లో ఆసక్తిగా చూపించారు. ఈ చిత్రానికి మాటలు: నాగసాయి, కెమెరా: అభినందన్ రామానుజన్, సంగీతం: ఓషో వెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్, నిర్మాణం: భవ్య క్రియేషన్స్.