అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న విభిన్న కథాచిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకుడు. బాలాజీ గుత్తా, కౌశిక్‌రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ ‘విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఏడుగురు స్త్రీల కథ ఇది. బంధాల విలువను తెలియజేసేలా ఈ కథ ఉంటుంది. ఇది అందరి కథ. సినిమా అంతా ఫన్‌గా ఉంటుంది. చివర్లో మంచి పాయింట్ ఉంటుంది’ అని తెలిపారు.